![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ హౌస్ లో నిన్నటి ఎపిసోడ్ లో ఫ్యామిలీ వీక్ సాగింది. అందులో మొదటగా విష్ణుప్రియ వాళ్ళ నాన్న మోహన్ వచ్చాడు. ఆ తర్వాత పృథ్వీ వాళ్ళ అమ్మ సత్యభామ వచ్చింది. ఆ తర్వాత గౌతమ్ వాళ్ళ అన్న జగదీష్ వచ్చారు. ఇక అందరు తమ విలువైన టిప్స్ ని అందించారు కానీ వాటిల్లో ఏది ఎవరు ఎంతవరకు ఫాలో అవుతారనేది తర్వాతి వారంలో తెలుస్తుంది.
నిన్న ఎపిసోడో లో అసలేం జరిగిందంటే.. హౌస్ లోకి విష్ణుప్రియ వాళ్ల నాన్న వచ్చాడు. అందరితోనూ సరదాగా మాట్లాడాడు.. అందరూ బాగా ఆడతున్నారు.. నువ్వు ఇంకా బాగా ఆడాల్రా అంటూ విష్ణుతో అనగా.. నాన్నా.. ఇలాంటివి ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పాలి.. ఇప్పుడొద్దు అంటూ విష్ణు నవ్వింది. ఇక విష్ణు తండ్రితో అవినాష్, రోహిణి, తేజ సరదాగా మాటలు కలిపారు. ప్రతి ఒక్కరితో నవ్వుతూ చాలా బాగా మాట్లాడాడు మోహన్.
ఇక మాటల సందర్భంలో అంకుల్ నాకు ఎవరైనా పిల్లని చూడొచ్చు కదా మీ ఊరిలో అంటూ తేజ అడిగాడు. దీనికి సరే ఒక 10 పుషప్స్ తియ్.. కచ్చితంగా చూస్తా అంటూ విష్ణు తండ్రి అన్నాడు. దీంతో తేజ చాలా కష్టపడ్డాడు కానీ పనవ్వలేదు. కానీ వెంటనే విష్ణు తండ్రి చకచకా అక్కడే ఇరవై పుషప్స్ తీసి చూపించాడు. ఇది చూసి కంటెస్టెంట్లు అందరూ వామ్మో అనుకున్నారు. తేజ అయితే అంకుల్ నేనే మీకు పిల్లని చూడాలి అంటూ నవ్వుకున్నాడు. విష్ణుతో ఒంటరిగా మాట్లాడారు తన తండ్రి. ఇంకా నువ్వు బాగా ఆడు.. నువ్వు కష్టపడితే విన్ అవుతావ్.. కానీ ట్రై చేయట్లేదు.. అందరికీ బ్యాడ్ అయిందేంటంటే.. ఆడియన్స్‌యే కాదు నీ ఫ్యాన్స్‌యే చాలా మంది బాధపడుతున్నారు.. నువ్వు ఎక్కువగా అటుంటున్నావని (పృథ్వీతో) అంటూ విష్ణు వాళ్ళ నాన్న అన్నాడు. ఎందుకు నేనేం చేశా.. ఇక్కడ ఎవరినైనా హగ్ చేసుకుంటే ఓ ఎనర్జీ వస్తుంది అది తనే.. ఇలా కాబట్టే ఇన్నాళ్లు ఉండగలిగా అంటూ విష్ణు కవర్ చేసుకుంది. అందరి మనస్తత్వాలు ఒకలా ఉండవు.. నువ్వు ఒక స్ట్రాటజీ ప్రకారం ఆడుతున్నావ్.. గేమ్‌లో అలా లవ్ చేసుకొని స్ట్రాటజీ ప్రకారం ఆడుతున్నావ్.. కానీ జనాలు అదంతా నిజమే అనుకుంటారంటూ మోహన్ అన్నాడు. దీనికి అదేంటి అది నిజమే అంటూ విష్ణుప్రియ అంది.
ఇంకా చెప్తూ ఇది లవ్ కాదు.. ఒకలాంటి ఇష్టం ఉంది.. అయినా ఇక్కడేం చేసుకోగలం మాటలు తప్ప.. తను ఉండటం వల్ల నాకు ఒక ఊపు.. పృథ్వీ, నిఖిల్, యష్మీ వీళ్లందరి వల్ల నాకు ఓ ఆనందం.. కానీ ఈ అబ్బాయి వల్ల ఇంకా ధైర్యం కలుగుతుంది.. కాఫీ తాగినప్పుడు ఉత్సాహం వచ్చినప్పుడు మనం ఎందుకు తాగకూడదు.. అలానే ఇది.. నా ఫీలింగ్స్ ఎందుకు కప్పేయాలంటూ విష్ణుప్రియ అడుగగా.. గేమ్ కోసం వచ్చావ్.. ముందు ఆ డ్యూటీ చెయ్.. అందరితో మాట్లాడు.. అందరితో బాగుండు.. కానీ నువ్వు ఒక్క దగ్గరే ఉండిపోయావని అనిపించుకోకూడదంటూ మోహన్ అన్నాడు. ఇన్ని టప్స్ ఇచ్చినా మన కళామతల్లి ముద్దుబిడ్డ మారుతుందనేది డౌటే.
![]() |
![]() |